హోదా సాధించేంత వరకు పోరు ఆగదు


 ఎంపిల రాజీనామా- ఆమరణ దీక్ష
 గ్రామ స్థాయి నుంచి రిలే దీక్షలు
ట్విటర్ లో వైయస్ జగన్ మోహన్ రెడ్డి 


హైదరాబాద్‌: రాష్ట్రంలోని యువతరానికి ఉద్యోగావకాశాలు కల్పించేందుకు పర్యాయపదమైన ప్రత్యేక హోదా  ఇవ్వకుండా  తాత్సారం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ఆందోళనలను ఉధృతం చేయాలని వైయస్ ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ ఆందోళనల్లో విశ్వవిద్యాలయాల విద్యార్ధులతోాటు, వైయస్ ఆర్ సీపీ శ్రేణులు కూడా పాల్గొంటారని ఆయన తన ట్విటర్ లే పేర్కొన్నారు. 
హోదా కోసం విద్యార్థులు యూనివర్సిటీ క్యాంపస్‌ల్లో ఆందోళనలు నిర్వహిస్తారని, రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు, పార్టీ  శ్రేణులు ప్రతి గ్రామం, మండలం, నియోజకవర్గం, జిల్లాస్థాయిల్లో నిరాహార దీక్షలు చేపడతారని ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు. 

‘ప్రత్యేక హోదా మన హక్కు. హోదా ఇవ్వకపోతే పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు ముగిసిన వెంటనే వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు రాజీనామా చేసి.. ఏపీ భవన్‌లో ఆమరణ నిరాహార దీక్ష చేపడతారు. ఏపీ ప్రయోజనాలు, యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చంద్రబాబునాయుడు కూడా టీడీపీ ఎంపీలతో రాజీనామా చేయించాలి. ప్రత్యేక హోదా కోసం వైఎస్‌ఆర్‌సీపీ తన పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంటుంది’ అని వైఎస్‌ జగన్‌ ట్విటర్‌లో తెలిపారు.
Back to Top