సదావర్తి సత్రం భూముల అక్రమాల్ని అడ్డుకొంటాం..వైయస్సార్సీపీ నేతలు

గుంటూరు:అమరావతి కి సంబంధించిన సదావర్తి సత్రం భూముల అక్రమాల్ని అడ్డుకొని తీరతామని
వైయస్సార్సీపీ ప్రకటించింది.  అమరావతిలోని సదావర్తి సత్రానికి
సంబంధించి ఒక్క అంగుళం భూమి కూడా అక్రమార్కులకు దక్కనివ్వమని వైఎస్సార్ కాంగ్రెస్
పార్టీ పెదకూరపాడు నియోజకవర్గ సమన్వయకర్త కావటి మనోహర్‌నాయుడు స్పష్టం చేశారు. అరండల్‌పేటలోని
పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.   తాను
అమరావతి దేవస్థానం వద్ద వచ్చి నిలబడి ఉంటానని, దమ్ముంటే
చర్చకు రావొచ్చన్నారు. నియోజకవర్గ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ నీతిపరుడని, సచ్ఛీలుడని చెబుతున్న ఆ పార్టీ నేతలు బహిరంగ చర్చకు సిద్ధమా
అని సవాల్ విసిరారు.దేవాదాయ
భూములను లాక్కునే పరిస్థితి వస్తే యుద్ధం తప్పదని చెప్పారు.  కేసులు పెట్టినంత మాత్రాన భయపడేది లేదని, కచ్చితంగా పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటానని చెప్పారు.
సదావర్తి భూముల విషయంలో అవసరమైతే న్యాయపోరాటానికి సిద్ధమన్నారు.

Back to Top