ప్రభుత్వం మెడలు వంచుతాం

వైయస్ఆర్ జిల్లా(రాజంపేట): ప్రజా సంక్షేమం కోసమే రాజకీయాల్లో ఉన్నామని, అధికారం కోస కాదని వైయస్ఆర్ సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి వైయస్ వివేకానందరెడ్డి అన్నారు. రాజంపేటలో జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి అధ్యక్షతన స్థానిక సంస్థాగత ఎమ్మెల్సీ ఎన్నికల సభ జరిగింది. ఈ సమావేశానికి హాజరైన సందర్భంగా వివేకానందరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం మెడలు వంచైనా ప్రజల సమస్యలను కచ్చితంగా పరిష్కరిస్తామని చెప్పారు. సమావేశంలో ఎంపీలు వైయస్ అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Back to Top