ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధం


ఏప్రిల్‌ 6న రాజీనామాలు.. ఏపీ భవన్‌లో దీక్ష
బాబు తోక పత్రికలు, ఛానళ్ల ప్రచారం దుర్మార్గం
వైయస్‌ జగన్‌ నాయకత్వంలో హోదా పోరాటం ఉధృతం చేస్తాం


నెల్లూరు: ఆంధ్రరాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రం బాగుపడుతుంది.. నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మొదటి నుంచి పోరాటం చేస్తున్నారని వైయస్‌ఆర్‌ సీపీ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. హోదా సాధన కోసం వైయస్‌ఆర్‌ సీపీ అలుపెరుగని పోరాటం చేస్తుందన్నారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైయస్‌ జగన్‌ ఆదేశాల మేరకు ఏప్రిల్‌ 6వ తేదీన వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలమంతా రాజీనామాలు చేసి ఏపీ భవన్‌ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆయన చెప్పారు. ప్రతిపక్షనేత పోరాటాలతో హోదాపై ప్రజల్లో మంచి అవగాహన వచ్చిందన్నారు. ప్రజల తిరుగుబాటును గ్రహించిన చంద్రబాబు యూటర్న్‌ తీసుకున్నాడని వివరించారు. నాలుగేళ్లు ప్రత్యేక హోదాను నీరుగార్చిన చంద్రబాబును..  హోదా కోసం ఒక్కడే పోరాడుతున్నట్లుగా కొన్ని పత్రికలు, ఛానళ్లు దారుణంగా చూపిస్తున్నాయని ధ్వజమెత్తారు. నిజంగా ప్రజల మధ్యలో నుంచి పోరాటం చేసిన వ్యక్తులు ఎవరో అందరికీ తెలుసన్నారు. 

స్పీకర్‌ ఫార్మాట్‌లో రాజీనామాలకు సిద్ధం: ఎంపీ మిథున్‌రెడ్డి

ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తూనే ఉంటామని వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కలిసి ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. హోదా కోసం పోరాటం ఉధృతం చేస్తున్న సమయంలో శ్రీవారి ఆశీస్సుల కోసం కొండకు వచ్చామన్నారు. హోదాపై లోక్‌సభలో చర్చ జరగకపోతే ఏప్రిల్‌ 6వ తేదీన స్పీకర్‌ ఫార్మాట్‌లో రాజీనామాలు చేస్తామని చెప్పారు
Back to Top