మా నాయకుడు అని చెప్పుకునేందుకు గర్విస్తున్నాం

నెల్లూరుః ఎన్టీఆర్ వారసులం అని చెప్పుకుంటున్న తెలుగుదేశం పార్టీ ..రాష్ట్రంలో కొన్ని లక్షల కుటుంబాలను మద్యానికి బానిసలు చేయడం దారుణమని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. నిజంగా చంద్రబాబు ఎన్టీఆర్ వారసుడే అయితే వెంటనే మద్యపానాన్ని నిషేధించాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే సంపూర్ణ మద్యనిషేధం అమలు చేస్తామని తమ నాయకుడు వైఎస్ జగన్ చెప్పడం గర్విస్తున్నామన్నారు. మహిళలంతా జననేత ఇచ్చిన హామీ పట్ల హర్షిస్తున్నారని చెప్పారు.

మద్యం కారణంగా వేలాది మంది అనారోగ్యం పాలవుతున్నారని, రోడ్ యాక్సిడెంట్లు జరుగుతున్నాయని అనిల్ కుమార్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల చేత ఇంత తాగించాలి, ఇంత అమ్మాలి అని చంద్రబాబు ఎక్సైజ్ అధికారులకు టార్గెట్ పెట్టడం దుర్మార్గమన్నారు. మద్యాన్ని ఆదాయ వనరుగా చూడకుండా  ప్రజల ప్రాణాల దృష్ట్యా నిషేధించాలని అనిల్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మద్యపాన నిషేధం ఉన్న గుజరాత్ ఎంతో అభివృద్ధి చెందిందని, బిహార్ లోనూ  అమలు చేస్తున్నారని అనిల్ తెలిపారు. 
Back to Top