ముచ్చుమ‌ర్రి ఎత్తిపోత‌ల నుంచి నీటి విడుద‌ల‌

క‌ర్నూలు:  ముచ్చుమ‌ర్రి ఎత్తిపోత‌ల ప‌థ‌కం నుంచి కేసీ కెనాల్‌కు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజ‌య్య నీటిని విడుద‌ల చేశారు. ఆయ‌క‌ట్టు పైర్లు ఎండిపోతున్న త‌రుణంలో రైతుల అవ‌స‌రాల నిమిత్తం ఎమ్మెల్యే ఐజ‌య్య సోమ‌వారం ముచ్చ‌మ‌ర్రి ఎత్తిపోత‌ల ప‌థ‌కం వ‌ద్ద గేట్ల‌ను ఎత్తి నీటిని దిగువ‌కు విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..టీడీపీ ప్ర‌భుత్వం వ్య‌వ‌సాయ రంగాన్ని విస్మ‌రించింద‌న్నారు. రైతుల కోసం పాటుప‌డుతున్నామ‌న్న చంద్ర‌బాబు మాట‌ల‌కు, చేత‌ల‌కు పొంత‌న లేకుండా పోయింద‌న్నారు. ముచ్చుమ‌ర్రి ఎత్తిపోత‌ల ప‌థ‌కం త‌న క‌ల అన్న చంద్ర‌బాబు, రైతుల‌కు నీళ్లు ఇవ్వ‌డం లేద‌ని విమ‌ర్శించారు. పంట‌ల‌కు స‌కాలంలో నీరంద‌క ఎండుద‌శ‌కు చేరుకున్నాయ‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. 

Back to Top