సమస్యలపై సమరం..క్యాంపు కార్యాలయం ముట్టడి

విజయవాడ(గాంధీనగర్)
: ఆంధ్రప్రదేశ్ లో పాలన పడకేసింది. పచ్చనేతల మొద్దునిద్రతో ప్రజలు తీవ్ర
ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. న్యాయపరమైన డిమాండ్ల కోసం ఆందోళన చేస్తున్న
నిరసనకారులపై చంద్రబాబు పోలీసులతో దౌర్జన్యకాండ ప్రదర్శిస్తున్నారు.
సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం...వారిని దారుణంగా  ఈడ్చుకెళ్లి అక్రమ
అరెస్ట్ లకు పాల్పడుతోంది.

తమ సమస్యలు  పరిష్కరం
కోసం వీఆర్ఏలు రేపు  సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించాలని
నిర్ణయించారు. ఈమేరకు వీఆర్ఏల సంఘం రాష్ర్ట అధ్యక్షుడు వీవీ మహేశ్వరరెడ్డి
ప్రకటించారు.  లెనిన్ సెంటర్‌లో వీఆర్‌ఏలు చేస్తున్న నిరవధిక నిరాహార
దీక్ష  మూడో రోజుకు చేరింది. 
50 రోజులుగా  ఆందోళన చేస్తున్నా
ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. న్యాయం
చేసేవరకు పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేస్తున్నారు.

కాగా
మొన్నటికి మొన్న విజయవాడ సీఎం క్యాంపు ఆఫీసు ముట్టడికి యత్నించిన అంగన్
వాడీలు, డీఎస్సీ అభ్యర్థులను పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. తమ
సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన వారిని పోలీసులు దారుణంగా ఈడ్చుకెళ్లి
వ్యాన్ లలో కుక్కి అరెస్ట్ చేశారు. ప్రభుత్వ నియంతృత్వ పోకడలపై
ఆందోళనకారులు భగ్గుమన్నారు. తమ డిమాండ్స్ నెరవేర్చేవరకు పోరాటం ఆపే
ప్రసక్తే లేదని వారు తేల్చిచెబుతున్నారు.
Back to Top