కృష్ణారావుకు విశ్వరూప్‌ పరరామర్శ

గొల్లవిల్లి(ఉప్పలగుప్తం): శస్త్ర చికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న ఫోటోగ్రాఫర్‌ల నియోజకవర్గ కన్వీనర్‌ సలాది కృష్ణారావును వైయస్సార్‌ సీపీ పీఏసీ సభ్యుడు పినిపే విశ్వరూప్‌ గురువారం పరామర్శించారు.  కృష్ణారావు ఇటీవల నరాల సంబందిత శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ఆరోగ్య పరిస్ధితిని అడిగి తెలుసుకున్న విశ్వరూప్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఎంపీపీ విరంగు సత్తిరాజు, వైయస్సార్‌ సీపీ రైతువిభాగం రాష్ట్ర కార్యదర్శి మోటూరి సాయి, మండల ఫోటోగ్రాఫర్స్, వీడియో గ్రాఫర్స్‌ వెల్ఫేయర్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు దేవరపల్లి వెకంటేశ్వరరావు, జాన భవానీ శంకర్‌లు పార్టీ నాయకులు సలాది శివాజీ, గంటా రామకృష్ణాజీ తదితరులు ఉన్నారు

Back to Top