విశాఖ నగరంలో వైయస్‌ఆర్‌సీపీ సందడి

 

- భారీ బహిరంగ సభకు చురుగ్గా ఏర్పాట్లు
విశాఖ జిల్లాః రేపు విశాఖపట్నం కంచరపాలెంలో జరిగే వైయస్‌ఆర్‌సీపీ భారీ బహిరంగ సభకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. విశాఖ‌ నగర వైయస్‌ఆర్‌సీపీ శ్రేణులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.  నగరం అంతా వైయస్‌ఆర్‌సీపీ జెండాలు, తోరణాలు, ప్లెక్సీలతో నిండుతనం సంతరించకుంది. రాజన్న బిడ్డ వస్తాడు..మా బతుకులకు భరోసా ఇస్తాడని బహిరంగ సభకు స్వచ్ఛందంగా కదిలివెళ్లడానికి ప్రజలు సిద్ధమవుతున్నారు.రైతులు, మహిళలతో బాటు అన్ని వర్గాల ప్రజా సంకల్పయాత్రకు నుంచి విశేష స్పందన లభించడంతో ఈ బహిరంగ సభకు అంచనాలకు మించి ప్రజలు వస్తారని వైయస్‌ఆర్‌సీపీ శ్రేణులు అంచనా వేస్తున్నాయి. ప్రజలు ఉద్యమంలా ఈ బహిరంగ సభలో పాల్గొనే అవకాశముందన్నారు

Back to Top