విజయసాయిరెడ్డి నామినేషన్ ఖరారు

హైదరాబాద్ః వైయస్సార్సీపీ రాజ్యసభ అభ్యర్థిగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  విజయసాయిరెడ్డి ఎన్నిక ఖరారైంది. అధికారికంగా ప్రకటించడం మాత్రమే తరువాయి. విజయసాయిరెడ్డి నామినేషన్ సవ్యమేనని రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న అసెంబ్లీ సెక్రటరీ సత్యనారాయణ వెల్లడించారు. ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్ లాల్ సమక్షంలో నామినేషన్ల పరిశీలన జరిగింది. కాగా వైయస్సార్సీపీ నుంచి రాజ్యసభకు వెళుతున్న తొలి ఎంపీగా విజయసాయిరెడ్డి చరిత్ర సృష్టించనున్నారు.

Back to Top