విజయమ్మ దీక్షకు కృష్ణయ్య సంఘీభావం

హైదరాబాద్, 04 ఏప్రిల్ 2013:

పెంచిన విద్యుత్తు చార్జీలకు నిరసనగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ చేపట్టిన నిరశన దీక్షకు బీసీ సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య సంఘీభావం ప్రకటించారు. గురువారం రాత్రి ఆయన దీక్షా ప్రాంగణానికి విచ్చేశారు. రాష్ట్రంలోని బీసీ సంఘాలన్నీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల దీక్షకు మద్దతు ప్రకటిస్తున్నాయన్నారు. మహానేత డాక్టర్ వైయస్ఆర్ మరణంతో రాష్ట్రానికి శని పట్టిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.  వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రజల పార్టీగా మారింది. ఆ ఈర్షతోటే ముఖ్యమంత్రి పన్నుల మోత మోగిస్తున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి పన్నుల ముఖ్యమంత్రిగా మారారు. ప్రజల్ని పీడించే సీఎంగా మారారు. వెంటనే చార్జీలను ఉపసంహరించుకోవాలనీ లేకుంటే ప్రజా ఉద్యమంలో కొట్టుకుపోతారనీ హెచ్చరించారు. ఈ ప్రభుత్వం దున్నపోతుమీద వాన కురిసిన చందంగా వ్యవహరిస్తోందని కృష్ణయ్య వ్యాఖ్యానించారు.

తాజా ఫోటోలు

Back to Top