దీక్ష విరమణకు విజయమ్మ తిరస్కరణ

గుంటూరు 22 ఆగస్టు 2013:

రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ వైఖరిని నిరసిస్తూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ తాను చేపట్టిన నిరవధిక దీక్షను విరమించడానికి తిరస్కరించారు. గురువారం సాయంత్రం ఆమెను పరిశీలించిన వైద్యుల బృందం.. రక్తంలో చక్కెర శాతం తగ్గిపోయిందనీ, రక్త పోటు కూడా తగ్గిందనీ పేర్కొన్నారు. తక్షణం ఆమె సెలైన్ ద్వారా వైద్యం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వైద్యుల సూచనను శ్రీమతి విజయమ్మ నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. లక్ష్యసాధన చేసేవరకూ దీక్షను విరమించబోనని ఆమె స్పష్టంచేశారు.

తాజా ఫోటోలు

Back to Top