జోగిపేటలో నేడు విజయమ్మ సభ

హైదరాబాద్ 25 జూన్ 2013:

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ మంగళవారం ఉదయం మెదక్ జిల్లా పర్యటనకు బయల్దేరారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఆమె పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. అందోలు నియోజకవర్గం జోగిపేటలో నిర్వహించే పార్టీ జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో విజయమ్మ పాల్గొంటారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగే సమావేశంలో ఆమె ప్రసంగిస్తారు. పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమ నిర్బంధం, కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు రాజకీయాలు, దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్ళాల్సిన అంశంపై శ్రీమతి విజయమ్మ ప్రసంగంలో ప్రస్తావిస్తారు. పంచాయతీ ఎన్నికల్లో విజయ కేతనం ఎగురవేయడం ద్వారా సాధారణ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేసే దిశగా పార్టీ గౌరవాధ్యక్షురాలి పర్యటన వుంటుందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెదక్ జిల్లా నేతలు తెలిపారు. శ్రీమతి విజయమ్మ రాకను పురస్కరించుకుని జిల్లా నేతలు విస్తృత ఏర్పాట్లు చేశారు.

Back to Top