ప్రైవేటు మెంబర్ బిల్లు ప్రవేశపెట్టనున్న విజయసాయిరెడ్డి

న్యూఢిల్లీ)) పార్టీ ఫిరాయింపుల
చట్టానికి సవరణలు కోరుతూ వైయస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి శుక్రవారం నాడు
రాజ్యసభలో ప్రైవేటు మెంబర్ బిల్లు ప్రవేశపెట్టనున్నారు. ఇందుకు సంబంధించి రాజ్యసభ
సెక్రటరీ జనరల్ కు ఇప్పటికే ఆయన నోటీసు ఇవ్వటం జరిగింది. ఈ నోటీసు శుక్రవారం నాడు
ప్రైవేటు మెంబర్ బిల్లుల జాబితాలో 17వదిగా లిస్టు అయింది.

రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్
లో చేర్చిన పార్టీ ఫిరాయింపుల చట్టంలో కొన్ని లోపాలు ఉన్నాయన్న మాట బలంగా
వినిపిస్తోంది. పార్టీ మారిన ప్రజా ప్రతినిధుల మీద చర్యలు తీసుకొనే అధికారం చట్ట
సభల స్పీకర్ కు ఇవ్వటం జరిగింది. కానీ స్పీకర్ సాధారణంగా అధికార పక్షానికి చెందిన
వ్యక్తి కావటం వల్ల, చాలా సందర్బాల్లో ఈ చట్టం అపహాస్యం పాలవుతోంది. దీంతో ఈ
అధికారాన్ని ఎన్నికల సంఘానికి అప్పగించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. అలాగే పార్టీ
ఫిరాయించిన వారి మీద చర్యలు తీసుకొనేందుకు నిర్దిష్ట కాల వ్యవధి ఉండాలన్న డిమాండ్
కూడా ప్రబలంగా వినిపిస్తోంది.

పార్టీ ఫిరాయింపుల
చట్టానికి ప్రజాస్వామ్య స్ఫూర్తితో సవరణలు చేయాలని విజయసాయిరెడ్డి కోరుతున్నారు.
ఇందుకు అనుగుణంగా ఆయన ప్రైవేటు మెంబర్  బిల్లు తీసుకొని వస్తున్నారు. 

తాజా వీడియోలు

Back to Top