విద్యుత్‌ చార్జీలపై తిరుపతిలో వైయస్‌ఆర్‌సిపి ధర్నా

తిరుపతి, 12 జనవరి 2013: ప్రభుత్వం చేస్తున్న విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదన‌ను నిరసిస్తూ వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ శనివారం తిరుపతిలో ధర్నా‌ నిర్వహించింది. తిరుచానూరు రోడ్డులో వైయస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి ఆధ్వర్యంలో విద్యుత్ ఛార్జీల పెంపు‌ ప్రతిపాదనకు నిరసనగా పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు.

దివంగత మహానేత డాక్టర్ వై‌యస్‌ రాజశేఖరరెడ్డి ఆశయాలకు కిరణ్‌ కుమార్‌రెడ్డి ప్రభుత్వం తూట్లు పొడుస్తున్నదని ఈ సందర్భంగా భూమన ధ్వజమెత్తారు. నిరుపేదలు, సామాన్యుల నడ్డి విరిచే విధంగా ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచుతు‌న్నదని భూమన మండిపడ్డారు. ఈ ధర్నాలో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో మహిళలు హాజరు కావడం విశేషం. ప్రభుత్వ వైఖరిపై నిరసనకారులు దుమ్మెత్తిపోశారు.
Back to Top