విద్యుత్‌ ఛార్జీలకు నిరసనగా చెత్తకుప్పల్లో ఫ్రిజ్‌లు

తిరుపతి, 1 ఏప్రిల్‌ 2013: మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి‌ కష్టార్జితంతో‌ వచ్చిన అధికారాన్ని అనుభవిస్తున్న కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ఆయన ఆశయాలకు పూర్తి విరుద్దంగా వ్యవహరిస్తోందని వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే భూమన కరుణాక‌ర్‌రెడ్డి ఆరోపించారు.‌ పేదలు, సామాన్యులు భరించలేని విధంగా విద్యుత్ ఛార్జీలు పెంచటం దారుణమని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పెంచిన విద్యు‌త్ ఛార్జీలకు నిరసనగా తిరుపతిలోని శివజ్యోతినగ‌ర్లో కరుణాక‌రరెడ్డి ఆధ్వర్యంలో స్థానికులు రిఫ్రిజిరేటర్లను చెత్తకుండీల్లో పడేసి నిరసన వ్యక్తం చేశారు.
Back to Top