విద్యారంగ అభివృద్ధికి వైయస్ అవిరళ కృషి

మదనపల్లె:

రాష్ట్రంలో విద్యారంగ అభివృద్ధికి, ఉపాధ్యాయుల అభ్యున్నతికి దివంగత మహానేత డాక్టర్ వైయస్. రాజశేఖరరెడ్డి చేసిన కృషి మరవలేనిదని ఎమ్మెల్సీ డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి చెప్పారు. ఆదివారం స్థానిక ఎమ్మెల్సీ కార్యాలయంలో వైయస్ఆర్ టీచర్సు ఫెడరేషన్-2013 క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఢిల్లీలో సామూహిక అత్యాచారానికి గురై మృతి చెందిన మెడికల్ విద్యార్థిని ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పేద విద్యార్థులు అందరూ చదువుకోవడానికి సౌకర్యంగా పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూ నిఫాం పంపిణీ కార్యక్రమాన్ని అమలు చేసిన మహోన్నత వ్యక్తి  వైయస్ అన్నారు. ఆయన పాలనలోనే ఎంతో మంది పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోవడానికి ఉపకార వేతనాలు, ఫీజురీయింబర్స్‌మెంట్ పథకాలను మంజూరు చేశారన్నారు. ఫెడరేషన్ సభ్యులందరూ విద్యాభివృద్ధికి కృషి చేసి, వైయస్ రుణం తీర్చుకోవాలని పిలుపునిచ్చారు.

Back to Top