వెన్నుపోటుదారుడు, పన్నుపోటుదారుడు చంద్రబాబే

హైదరాబాద్, 19 మే 2013:

తెలుగుదేశం నేతలు వర్ల రామయ్య, రేవంత్ రెడ్డిలపై వైయస్ఆర్ కాంగ్రెస్ నేత డాక్టర్ నల్లా సూర్యప్రకాశ్‌ మండిపడ్డారు. వైయస్ఆర్ కాంగ్రెస్ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నోరు పారేసుకునే ఈ పిట్టల దొరలను అదుపుచేయాలని ఆయన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడును హెచ్చరించారు. వర్ల రామయ్య అడ్డగోలుగా మాట్లాడుతూ తన ఇంటి పేరును సార్థకం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. వైయస్ఆర్‌సీ కాంగ్రెస్ పార్టీవి కాకి పలుకులంటూ రేవంత్‌రెడ్డి గాడిదలా వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. 50 ప్రభుత్వ రంగ సంస్థల్ని పప్పు బెల్లాలా తన వారికి అమ్ముకున్నది  చంద్రబాబేనని మరువద్దన్నారు. పరిటాల హత్యకు చంద్రబాబే కారణం కావచ్చు కదా అనే అనుమానాలను సూర్యప్రకాశ్ వ్యక్తం చేశారు. పాదయాత్ర ద్వారా చంద్రబాబుకు కాళ్ల నొప్పులు తప్ప మిగిలిందేమీ లేదని ఎద్దేవా చేశారు. ప్రజల దృష్టిలో వెన్నుపోటుదారుడు, పన్నుపోటు దారుడు చంద్రబాబునని విరుచుకుపడ్డారు. ప్రజలు ఆయనను ఇక  జీవితంలో నమ్మలేరని స్పష్టంచేశారు. తమ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి కడిగిన ముత్యంలా బయటకు రావడం ఖాయమని నల్లా సూర్యప్రకాశ్‌ అన్నారు.

Back to Top