వెంకటాద్రినగర్‌లో పార్టీ జెండా ఆవిష్కరణ

మిర్యాలగూడ (నల్గొండ జిల్లా), 17 ఫిబ్రవరి 2013: మిర్యాలగూడలోని వెంకటాద్రిపాలెంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జెండాను శ్రీమతి షర్మిల ఆవిష్కరించారు. పట్టణంలోని శ్రీనివాసనగర్‌ నుంచి ఆదివారం ఉదయం తన మరో ప్రజాప్రస్థానం 69వ రోజు పాదయాత్రను శ్రీమతి షర్మిల ప్రారంభించారు. అక్కడి నుంచి ఆమె సెయింట్‌ రేమండ్సు పాఠశాల నుంచి వైయస్ అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు వెంటరాగా పాదయాత్రకు బయలుదేరారు. కాగా, శ్రీమతి షర్మిల వెంకటాద్రిపాలెం చేరుకునేసరికి స్థానికులు పెద్ద ఎత్తున ఎదురేగి సాదరంగా స్వాగతం పలికారు. మహిళలైనే కోలాటాలతో జననేత జగనన్న సోదరికి స్వాగతం చెప్పారు.

 వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌ రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం 69వ రోజు పాదయాత్ర ప్రారంభమైంది. మిర్యాలగూడ శ్రీనివాసనగర్‌లోని సెయింట్ రైమండ్స్ పాఠశాల నుంచి అభిమానులు, కార్యకర్తలు వెంటరాగా ఆమె బయలుదేరారు. వెంకటాద్రిపాలెం వెళ్లిన షర్మిలకు గ్రామస్తులు పెద్దఎత్తున ఘనస్వాగతం పలికారు. మహిళలు కోలాటాలతో స్వాగతం పలికారు.

ప్రజా కంటక కాంగ్రెస్‌ ప్రభుత్వం, దానితో అంట కాగుతున్న టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు తీరుకు వ్యతిరేకంగా, కష్టాల్లో ఉన్న రాష్ట్ర ప్రజలకు భరోసా ఇచ్చేందుకు శ్రీ జగన్‌ తరఫున శ్రీమతి షర్మిల మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర చేస్తున్నారు. ఆదివారంనాటి పాదయాత్రలో మాజీ ఎం.పి. అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్పతో పాటు ఆయన కుటుంబ సభ్యలు కూడా శ్రీమతి షర్మిలతో పాటు నడుస్తున్నారు.
Back to Top