వెల్లువెత్తిన ఆగ్రహం

విద్యుత్తు కోతలపై వైయస్‌ఆర్‌సీపీ ఆందోళన

జన్నారం: కిరణ్‌కుమార్ సర్కార్ చేతగానితనంతో రాష్ట్రంలో చీకటి పాలన కొనసాగుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా కన్వీనర్ బోడ జనార్దన్ ధ్వజమెత్తారు. కరెంట్ కోతలను నిరసిస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో మంగళవారం మండల కేంద్రంలోని విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ సంక్షోభం రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడంతో ప్రజలు చీకట్లో ఉండాల్సిన పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ముట్టడిని అడ్డుకునేందుకు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. సబ్‌స్టేషన్ ప్రధాన ద్వారంతోపాటు పక్కన ఉన్న చిన్న ద్వారానికీ తాళం వేశారు. మీడియూను సైతం లోనికి అనుమతించలేదు. వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో..

శ్రీరాంపూర్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నాయకులు స్థానిక సీసీసీ కార్నర్ వద్ద రాస్తారోకో చేశారు. విద్యుత్ కోతలతో అన్నివర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ బొడ్డు చిన్నయ్య, విద్యార్థి విభాగం మండల కన్వీనర్ నామాల రమేశ్, నాయకుడు కె.వరుణ్‌రెడ్డి పేర్కొన్నారు.  ప్రభుత్వానికి, వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పార్టీ యువజన విభాగం మండల కన్వీనర్ బద్రి శ్రీకాంత్, నాయకులు కార్ల కార్తిక్, తిరుపతి, సంతోశ్, మధుకర్, వినోద్ పాల్గొన్నారు.ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే

ఉట్నూర్: మితిమీరిన కరెంట్ కోతలు ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమేనని ఏఐకేఎంఏస్ (ఆఖిల భారత రైతు కూలీ సంఘం) జిల్లా ప్రధాన కార్యదర్శి మర్సకోల తిరుపతి అన్నారు. విద్యుత్ కోతలను నిరసిస్తూ మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. ఆర్డీవో మహేశ్‌కు వినతి పత్రం సమర్పించారు.

రాజమండ్రిలో...
రాజమండ్రి: వేళాపాళా లేని విద్యుత్ కోతలపై జిల్లాలో మంగళవా రం ఆందోళనలు జరిగాయి. కె.గంగవరంలో జరిగిన ఆం దోళనలో వైఎస్సార్ కాంగ్రెస్ కేంద్ర పాలక మండలి సభ్యు డు, మాజీ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి రావాల్సిన గ్యాస్ కోటా సాధించడంలో అధికార పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు విఫల మయ్యారని విమర్శించారు. మెయిన్ రోడ్డు మీదుగా ర్యాలీ నిర్వహించి, విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. గంటసేపు ఆందోళన కొనసాగింది. రాజమండ్రి జాంపేటలో ని విద్యుత్ కార్యాలయం ఎదురుగా పార్టీ నేత లు ధర్నా చేశారు. ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కా ర్యదర్శి టీకే విశ్వేశ్వరరెడ్డి, సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శిసుంకర చిన్ని హాజరయ్యారు. ముందుగా కార్యాలయం వద్ద బైఠాయించి, ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.  తొండంగి గ్రామంలో పార్టీ మండల కన్వీనర్ చెక్క హరిబాబు ఆధ్వర్యంలో అక్కడి సబ్‌స్టేషన్ ముందు గంట సేపు ధర్నా చేశారు. గొల్లప్రోలులో కూడా ర్యాలీ, సబ్ స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించారు.

గుంటూరులో..
గుంటూరు: విద్యుత్తు కోతలకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లాలో నిరసనలు మిన్నంటాయి. చేతగాని ప్రభుత్వానికి పాలించే హక్కు లేదంటూ పార్టీ నేతలు ధ్వజమెత్తారు. పార్టీ పిలుపు మేరకు విద్యుత్ సమస్యలపై ఉద్యమాన్ని మంగళవారం నుంచి తీవ్రతరం చేశారు. దీనిలో భాగంగా అన్ని నియోజకవర్గాల్లో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. మరో రెండ్రోజులపాటు ఆందోళనలు కొనసాగించి 31న జిల్లావ్యాప్తంగా బంద్ నిర్వహించనున్నారు. ఈ క్రమంలో జిల్లాలోని మండలాల్లో విద్యుత్ సబ్‌స్టేషన్ల ముట్టడి, ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించి ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు.జిల్లావ్యాప్తంగా..చిలకలూరిపేట నియోజకవర్గంలోని నాదెండ్ల మండలం సాతులూరులో పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ నేతృత్వంలో విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం రాస్తారోకో చేశారు. పార్టీ నాయకులు కె.వీరారెడ్డి, అల్లాడి భాస్కర్ సురేష్, తదితరులు పాల్గొన్నారు. సత్తెనపల్లి నియోజకవర్గంలోని నకరికల్లు మండలంలో జరిగిన రాస్తారోకోలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు పాల్గొని ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పార్టీ నాయకులు చిట్టా విజయభాస్కర్‌రెడ్డి, డాక్టర్ గజ్జల నాగభూషణ్‌రెడ్డి పాల్గొన్నారు. మాచర్ల నియోజకవర్గంలోని కారంపూడి మండలంలో జరిగిన రాస్తారోకోలో పార్టీ నాయకులు పిన్నెల్లి వెంకటరామిరెడ్డితోపాటు పలువురు మండల నేతలు పాల్గొన్నారు. రెంటచింతలలో జరిగిన రాస్తారోకోలో ప్రభుత్వ దిష్టిబొమ్మకు దహన సంస్కారాలు నిర్వహించారు.పార్టీ నాయకులు ఫాతిమారెడ్డి, ఉమామహేశ్వరరావు, కట్టమూరు నాగేశ్వరరావు పాల్గొన్నారు. పెదకూరపాడు నియోజకవర్గంలోని క్రోసూరు మండలంలో విద్యుత్ సబ్‌స్టేషన్‌ను పార్టీ నేతలు ముట్టడించారు. తుళ్లూరు మండలం రాయపూడి సబ్ స్టేషన్ వద్ద జరిగిన ధర్నాలో పార్టీ నాయకులు మందపాటి శేషగిరిరావు, నాగమణి పాల్గొన్నారు. గురజాల నియోజకవర్గంలోని దాచేపల్లిలో పార్టీ బీసీ విభాగం కన్వీనర్ దేవెళ్ళ రేవతి ఆధ్వర్యంలో విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. పార్టీ నాయకులు జాకీర్‌హుస్సేన్, ఎం.ప్రకాష్‌రెడ్డి పాల్గొన్నారు. రేపల్లె నియోజకవర్గంలోని నగరం మండలంలో విద్యుత్ సబ్‌స్టేషన్‌ను పార్టీ నేత ఎం.ప్రేమ్‌సుధాకర్ ఆధ్వర్యంలో ముట్టడించారు.  వేమూరులో పార్టీనేత మేరుగ నాగార్జున ఆధ్వర్యంలో సబ్‌స్టేషన్ ముందు ధర్నా నిర్వహించారు. మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లి మండలం కుంచనపల్లి గ్రామంలో జరిగిన ధర్నాలో పార్టీ నాయకులు దొంతిరెడ్డి వేమారెడ్డి, పాతూరి లలితకుమారి, బొమ్మారెడ్డి సునీత పాల్గొన్నారు. తెనాలి పట్టణంలో విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద పార్టీ నేత ఈదర శివరామకృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.గుంటూరు నగరంలో..నగర కన్వీనర్ లేళ్ళ అప్పిరెడ్డి నేతృత్వంలో తూర్పు నియోజకవర్గంలోని పొన్నూరురోడ్డులోని విద్యుత్‌సబ్‌స్టేషన్ వద్ద పార్టీ శ్రేణులు ధర్నా నిర్వహించారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. అధికారులకు వినతిపత్రం అందజేశారు.

తాజా ఫోటోలు

Back to Top