ముఖ్యమంత్రిపై వాసిరెడ్డి నిప్పులు

హైదరాబాద్ 17 అక్టోబర్ 2013:

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యాంధ్ర నయవంచకుడని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. ఆరు కోట్ల సీమాంధ్రులను బలి పశువులను చేశారని ఘాటుగా వ్యాఖ్యానించారు. సీఎం కిరణ్ సోనియా గాంధీ కోవర్టని ఆరోపించారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి తూట్లు పొడిచిన విభజనవాది సీఎం కిరణ్ అన్నారు. సీఎంను చరిత్ర క్షమించదని చెప్పారు. సీఎం కిరణ్ చేసిన ద్రోహాన్ని సీమాంధ్రులు ఎన్నడూ మరిచిపోరన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని సీఎం కిరణే నీరు గారుస్తున్నారన్నారు.   మాయ మాటలు చెప్పి ఉద్యమాన్ని ఉద్యోగులకు నుంచి సీఎం తప్పిస్తున్నారని వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా.. రాష్ట్రాన్ని ముక్కలు చేయకుండా తమ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి కాపాడతారని ధీమాను ఆమె  వ్యక్తం చేశారు.

Back to Top