బాబు కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతున్నాడు

  • బాబుకు లా అండ్ ఆర్డర్ మీద కంట్రోల్ లేదు
  • ఆయనకు సీఎంగా ఉండే అర్హత లేదు
  • టీడీపీ నేతలు తప్పులు చేసినా చర్యలు తీసుకోడు
  • జేసీ దివాకర్ రెడ్డి తిట్టినా స్పందించడు
  • ఇలాంటి మనిషి మా పార్టీ గురించి మాట్లాడడం హాస్యాస్పదం
  • విజయవాడలో జరిగిన సంఘటనపై సీబీఐ ఎంక్వైరీ వేయించాలి
  • సంబంధిత అధికారులను శిక్షించాలిః వంగవీటి రాధాకృష్ణ
విజయవాడః లా అండ్ ఆర్డర్ మీద కంట్రోల్ లేని చంద్రబాబుకు అసలు సీఎంగా ఉండే అర్హత ఉందా అని వైయస్సార్సీపీ నేత వంగవీటి రాధాకృష్ణ ప్రశ్నించారు. ఓ మహిళ, మాజీ శాసనసభ్యురాలు అని కూడ చూడకుండా పోలీసులు రోడ్డుపై ఈడ్చుకుంటూ స్టేషన్ కు తీసుకెళితే..సంబంధిత అధికారులపై ముఖ్యమంత్రి కనీస చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు. ఇలాంటి చంద్రబాబు మా పార్టీమీద, మా నాయకుని మీద మాట్లాడడం హాస్యాస్పదమన్నారు.  ఎవరు తప్పుచేసినా వైయస్సార్సీపీ ఉపేక్షించదు కాబట్టే తప్పుడు వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని పార్టీ నుంచి వెంటనే సస్పెండ్ చేయడం జరిగిందన్నారు. టీడీపీ నాయకులు అనేక తప్పులు చేస్తున్నా చంద్రబాబు చర్యలు  తీసుకోవడం లేదన్నారు. మీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి నిన్ను తిడితే దాని గురించి ఒక్క మాట మాట్లాడని నీవా మా గురించి మాట్లాడేదంటూ వంగవీటి రాధాకృష్ణ చంద్రబాబుపై మండిపడ్డారు. టీడీపీకి చెందిన ప్రజాప్రతినిధులు అధికారుల మీద దాడులు చేస్తున్నా పట్టించుకోకుండా చంద్రబాబు రాజీ చేసుకుంటూ పోతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మాజీ శాసనసభ్యురాలి పట్ల పోలీసులు దుర్మార్గంగా ప్రవర్తించారని ప్రతీ ఒక్కరూ ఖండిస్తుంటే... సీఎం రాజధానిలో ఉండి కూడ, జరిగిన సంఘటన గురించి కనుక్కోకుండా కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతున్నాడని వంగవీటి రాధాకృష్ణ నిప్పులు చెరిగారు.  తాను ప్రెస్ మీట్ పెట్టేందుకు వెళ్తుంటే పోలీసులు అత్యుత్సాహం చూపించారన్నారు. సంబంధిత అధికారుల మీద యాక్షన్ తీసుకోకుండా చంద్రబాబు తమ పార్టీ గురించి మాట్లాడడం సిగ్గుచేటన్నారు. బాబు బెట్టింగ్ ల గురించి మాట్లాడుతున్నావ్.  నంద్యాల ఎన్నికల్లో టీడీపీ ఎంపీ, వాళ్ల వ్యక్తులు ఎన్ని కోట్ల బెట్టింగ్ కట్టారో నీకు తెలియదా..? కుల మతాల ఘర్షణలని మాట్లాడుతున్నావ్.  సీఎం స్థాయి వ్యక్తి ఇలాగేనా మాట్లాడేది..? బాబు హుందాగా వ్యవహరించాలి. బాబు ఏవిధంగా కుల రాజకీయాలు చేస్తున్నాడో అందరికీ తెలుసు. రాజధానిలో మేం రైతుల తరపున పోరాడుతున్నాం. చంద్రబాబు ఇరిగేషన్ ప్రాజెక్ట్ లను అడ్డుపెట్టుకొని అవినీతికి పాల్పడుతుంటే అడ్డుపడుతున్నాం. అంతేతప్ప తాము రాజధానికి ఏనాడు అడ్డుకాదు. 

మా పార్టీలో జరిగిన సంఘటన ఇది. రంగా అభిమానులు బాధపడ్డారు కాబట్టి మా పార్టీ ఓ స్టాండ్ తీసుకొని సస్పెండ్ చేశారు. చంద్రబాబుకు దమ్ము, ధైర్యం ఉంటే తనపార్టీ నేతల వికృత చేష్టలపై చర్యలు తీసుకోవాలి. ఆ తర్వాత మా గురించి మాట్లాడాలి. మా పార్టీ అందరినీ కలుపుకొని పోతుంది. మేం ప్రజల పక్షాన ఉంటాం. సంబంధిత అధికారుల మీద ఇవాల్టికి కూడ బాబు ఎంక్వైరీ చేయలేదు. నీకు చిత్తశుద్ధి ఉంటే, ప్రజల పక్షాన ఉన్నావనుకుంటే ఎంక్వైరీ వేసి విచారణ జరిపించాలి. సంబంధిత అధికారులను శిక్షించాలి. మేం కూడ ఫిర్యాదు చేస్తాం. హ్యూమన్ రైట్స్ ను అప్రోచ్ అవుతాం. ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉంది. ప్రజలకు స్వేచ్ఛ కలిపించాలని వంగవీటి రాధాకృష్ణ
ప్రభుత్వానికి హితబోధ చేశారు. 

తాజా ఫోటోలు

Back to Top