చంద్రబాబుదంతా పనికిమాలిన పాలన: వంగవీటి రాధా

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై వైఎస్సార్సీపీ నేత వంగవీటి రాధా విరుచుపడ్డారు. చంద్రబాబు చేస్తున్నదంతా కూడా పనికిమాలిన పరిపాలన అన్నారు. రాజధాని నిర్మాణం పేరిట బలవంతపు భూసేకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ విజయవాడ సీఆర్డీఏ కార్యాలయం వద్ద వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజలంతా స్వచ్ఛందంగా రాజధాని కోసం తమ భూములు ఇచ్చారని చెప్తున్నారని అవన్నీ కూడా అవాస్తవాలు అని చెప్పారు.

సింగపూర్ తరహా రాజధాని ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాతిపదికన నిర్మిస్తున్నారని ప్రశ్నించారు. తామెప్పుడూ రాజధాని నిర్మాణానికి విరుద్ధం కాదని తెలిపారు. విజయవాడకు గతంలో ఎన్నడూ లేని ట్రాఫిక్ తీసుకొచ్చారని, చంద్రబాబు వచ్చారని ఒకసారి నారాయణ వచ్చారని ఒకసారి, పుల్లారావు వచ్చారని ఒకసారి రోడ్డు వెంట అంగుళం కదలనివ్వకుండా వాహనాలు నిలిపేస్తున్నారని చెప్పారు. ఈ పరిస్థితిపట్ల గెలిపించిన ప్రజలే నానా తిట్లు చంద్రబాబును తిడుతున్నారని తెలియజేశారు. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ రైతుల పక్షాన ఉండేది ఒక్క వైఎస్ జగనే అని, వైఎస్సార్సీపీనే అని వంగవీటి రాధ తెలిపారు.
Back to Top