వంచనకు మారుపేరు చంద్రబాబు..

అన్యాయంపై కాకినాడ మహిళలు ఆగ్రహం..
తూర్పుగోదావరిః ఏపీకి ప్రత్యేకహోదా కోసం మొదటినుంచి పోరాడిన వ్యక్తి వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అని కాకినాడ మహిళలు అన్నారు.చంద్రబాబు ఓటుకు నోటుకు కేసుకు భయపడి హోదాను తాకట్టు పెట్టేశాడని విమర్శించారు.యూటర్న్‌లు తీసుకునే చంద్రబాబును ఎవరూ నమ్మరని ధ్వజమెత్తారు.ఎన్నికల ముందు తిరుమల వెంకటేశ్వరస్వామి సాక్షిగా ు 15 సంవత్సరాలు ప్రత్యేకహోదా తీసుకుని వస్తానని చంద్రబాబు ప్రజలను నమ్మించారన్నారు.నాలున్నరేళ్లు బీజేపీతో సంసారం చేసిన చంద్రబాబు విభజన హామీలను గాలికొదిలేశారన్నారు.ప్రజలు ఒకసారి మోసాపోయారని, రెండోసారి మోసపోవడానికి సిద్ధంగా లేరన్నారు.రాబోయే కాలంలో  ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. వంచనకే మారు పేరు చంద్రబాబు నాయుడని సొంతమామనే వెన్నుపోటు పోడిచి అధికారం లాక్కురని తెలిపారు.ప్రత్యేకహోదా వస్తే ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి చెందుతుందన్నారు.పరిశ్రమలు,ఉద్యోగాలు వస్తాయన్నారు. ధర్మపోరాటాలు అంటూ ప్రజలను ఇంకా మోసగించే ప్రయత్నాలు చంద్రబాబు చేస్తున్నారన్నారు.
Back to Top