వైయస్ పథకాలతో బడుగులకు మేలు: వనమా

‌హైదరాబాద్ :

దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల వారికి ఎంతో మేలు జరిగిందని, ఆయన వల్ల లబ్ధి పొందిన వారు తెలంగాణలో కూడా లక్షల సంఖ్యలో ఉన్నారని వనమా వెంకటేశ్వరరావు తెలిపారు.‌ వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ‌ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పద్నాలుగేళ్ల పాటు‌ వనమా వెంకటేశ్వరరావు సేవలందించారు.

మహానేత డాక్టర్‌ వైయస్ఆర్ ఆశయాల అమలుకు కృషిచేసే నాయకుడు‌ శ్రీ జగన్ మాత్రమే‌ అన్న నమ్మకంతో తాను ఈ పార్టీలో చేరానని వనమా అన్నారు. పద్నాలుగేళ్లు నిబద్ధతతో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన తనను కాంగ్రె‌స్ పార్టీ చివరి దశలో మోసం చేసిందన్నారు.‌ కాంగ్రెస్, సీపీఐ రెండూ నిబద్ధత లేని పార్టీలే అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఖమ్మం లోక్‌సభా స్థానం పార్టీ సమన్వయకర్త పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. పార్టీలో వనమా చేరినందుకు తమకు ఆనందంగా ఉందని, ఆయన చేరిక తెలంగాణలో వైయస్ఆర్‌సీపీ ప్రభంజనం సృష్టిస్తుందనడానికి సంకేతమని అన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో మిగిలిపోయిన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేసేందుకు తమ పార్టీ కృషి చేస్తుందని చెప్పారు.

Back to Top