'వైయస్‌ఆర్‌సిపి విజయ దుందుభి ఖాయం'

రాజమండ్రి : రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయ దుందుభి మోగించడం, 190కు పైగా సీట్లు గెలుచుకోవడం తథ్యం అని పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ధీమా వ్యక్తం చేశారు. అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష ‌టిడిపిలు స్వయంగా చేయించుకున్న వేర్వేరు ప్రైవేట్ సర్వేల్లో‌ ఈ విషయం వెల్లడైందని ఆయన అన్నారు.

ఉపాధి హామీ కూలీలు, ఎస్సీ కాలనీ దళిత యువకులు విరాళాలు వేసుకుని కోరుకొండ మండలం నరసాపురం గొల్లవీధిలో వేర్వేరుగా ఏర్పాటు చేసిన దివంగత మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలను పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావుతో కలసి సోమవారం అంబటి ఆవిష్కరించారు. ముందు గొల్లవీధిలో విగ్రహాన్ని బాబూరావు ఆవిష్కరిం‌చారు. ఎస్సీ కాలనీలో విగ్రహాన్ని అంబటి ఆవిష్కరించారు. ఎస్సీ పేటలో రాత్రి జరిగిన బహిరంగ సభలో అంబటి మాట్లాడారు.
Back to Top