వైయస్‌ఆర్‌సిపికి 192 సీట్లు ఖాయం: జూపూడి

కందుకూరు (ప్రకాశం జిల్లా) : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ 192 నియోజకవర్గాల్లో విజయదుందుభి మోగించడం ఖాయమని పార్టీ అధికార ప్రతినిధి, కేంద్ర పాలక మండలి సభ్యుడు జూపూడి ప్రభాకర్‌రావు ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డికి క్రిస్మస్‌ పర్వదినం లోగా బెయిల్ రావడం ‌తథ్యమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అతి కొద్ది కాలంలోనే వైయస్‌ఆర్‌ సిపి రాష్ట్ర ప్రజల హృదయాల్లో సుస్థిరమైన స్థానం సంపాదించుకుందని వ్యాఖ్యానించారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డి లాంటి నాయకుడు రావాల్సిన అవసరం మన రాష్ట్రానికి ఎంతైనా ఉందని అన్నారు. రాష్ట్రంలో పేదరికాన్ని అర్థం చేసుకున్న నాయకుడు శ్రీ జగన్‌ అన్నారు.
Back to Top