వైయస్ఆర్ సీపీలో చేరిన వజ్ర భాస్కర్

కదిరి:

అనంతపురం జిల్లా తలుపుల మండలానికి చెందిన వజ్ర భాస్కర్‌రెడ్డి బుధవారం హైదరాబాద్‌లో వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. జగన్మోహన్‌ రెడ్డి అభిమాని అయిన ఈయన ఇటీవల జగన్ అక్రమ అరెస్టును నిరసిస్తూ, బెయిల్ రావాలని ఆ కాంక్షిస్తూ కదిరి నుంచి ఇడుపులపాయ, కడప మీదుగా 270 కిలో మీటర్ల పాదయాత్ర చేశారు. పార్టీ విజయం కోసం సైనికుడిలా పనిచేస్తానని  ఆయన తెలిపారు.

Back to Top