వైయస్ఆర్ కాంగ్రెస్‌తోనే స్వర్ణయుగం

మదనపల్లె:

రాష్ర్టంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో నే స్వర్ణయుగం సాధ్యమని పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి స్పష్టంచేశారు. మదనపల్లె రూరల్ మండలంలోని కొత్తపల్లె పంచాయతీ రంగారెడ్డి కాలనీలో ఎంపీటీసీ మాజీ సభ్యురాలు భారతి ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సీ ఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పాలన అస్తవ్యస్థంగా తయారైందని విమర్శించారు. పార్టీని  బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఉదయ్‌కుమార్ మాట్లాడుతూ మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం కాలరాస్తోందన్నారు. అనంతరం రంగారెడ్డి కాలనీవాసులు దాదాపు 500 మందికి పైగానే పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో నాయకులు చిప్పిలి జగన్నాధరెడ్డి, పట్టణ కన్వీనర్ సురేంద్ర, యమలాసుదర్శనం, కత్తి కృష్ణమూర్తి, పాల్‌బాజాజీ, పార్టీలో చేరిన రంగారెడ్డి కాలనీ వాసులు భారతి, ఆదినారాయణ,శ్రీనివాసులు, రామకృష్ణ, చేపల శివ, గోపాల్‌నాయక్, మదన్, గిరిజ, ఉషారాణి, ఉదయశ్రీ, అంజలి తదితరులు పాల్గొన్నారు.

Back to Top