వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరికలు

హైదరాబాద్, 19 మే 2013:

రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లా నుంచి వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో ఆదివారం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.  రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ఆధ్వర్యంలో 200 మంది యువకులు వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్‌లో వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ నేతలు జంపన్న ప్రతాప్, వెంకట్రావ్ సమక్షంలో 100 మంది కార్యకర్తలు పార్టీలో చేరారు. సికింద్రాబాద్ నేత ఆదం విజయ్ సమక్షంలో 100 మంది కార్యకర్తలు పార్టీలో చేరారు. కూకట్పల్లిలో  వడ్డేపల్లి నర్సింగరావు ఆధ్వర్యంలో వివిధ కార్మిక సంఘాల నుంచి 200 మంది పార్టీలో చేరారు.

పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం నల్లజర్ల మండలం గాంధీనగర్లో ఆ పార్టీ నాయకురాలు షర్మిల సమక్షంలో 300 మంది కార్యకర్తలు పార్టీలో చేరారు. వరంగల్ జిల్లా నెల్లికుదురు మండలం మదనతుర్తి గ్రామంలో వివిధ పార్టీలకు చెందిన 200 మంది కార్యకర్తలు జన్నారెడ్డి మహేందర్ రెడ్డి, కర్ణావతు రాధా వెంకన్ననాయక్ ఆధ్వర్యంలో పార్టీలో చేరారు.

ఖమ్మం జిల్లా భద్రాచల నియోజకవర్గ కన్వీనర్ డాక్టర్ తెల్లం వెంకట్రావ్ సమక్షంలో మెల్లిమి హర్షవర్దన్ సహా 400 మంది కార్యకర్తలు వైయస్ఆర్‌సీపీలో చేరారు. ఈ సందర్భంగా వారంతా భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం సింగర్‌పల్లిలో గిద్దలూరు సమన్వయకర్త ముత్తుముల అశోక్‌రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ, కాంగ్రెస్ నుంచి 500 మంది పార్టీలో చేరారు.

Back to Top