'వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకే ప్రజల పట్టం'

ఏన్కూరు (ఖమ్మం జిల్లా) : మహానేత డాక్టర్ వై‌యస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు కావాలంటే వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరాన్ని ప్రజలు గుర్తించారని పార్టీ సీఈసీ సభ్యుడు బాణోత్‌ మదన్‌లాల్‌ తెలిపారు. అందుకే వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ వైపు వారు మొగ్గు చూపుతున్నారని ‌ఆయన చెప్పారు. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం హిమమ్‌నగర్‌లో మాజీ ఎంపిపి భూక్యా కిషన్, మండల యూ‌త్ కాంగ్రె‌స్ అధ్యక్షుడు మాళోతు నర్సింహారావు ఆధ్వర్యంలో వంద కుటుంబా‌లు, రాజులపాలెంలో తేజావత్ గన్యానాయ‌క్ ఆధ్వర్యంలో 50 కుటుంబా‌లు, సిపిఎంకు చెందిన వాంకుడోతు బిచ్చానాయక్ కుటుంబీకులు సోమవారం మద‌న్‌లాల్ సమక్షంలో వై‌యస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీలో చేరారు.‌

వారికి మదన్‌లాల్ పార్టీ కండువాలను కప్పి ఆహ్వానించారు. అనంతరం, వారి‌ని ఉద్దేశించి మదన్‌లాల్ మాట్లాడుతూ.. అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన మహానేత డాక్టర్ వైయస్ఆర్‌ను ప్రజలు తమ గుండెల్లో పెట్టుకుని పూజిస్తున్నారని ‌అన్నారు. ఓదార్పు యాత్ర ద్వారా ప్రజలకు శ్రీ జగన్ అండగా నిలిచార‌న్నారు. శ్రీమతి షర్మిల తన పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలు తెలుసుకుంటున్నారని, వారికి భరోసా ఇస్తున్నారని చెప్పారు. మహానేత వైయస్‌ఆర్ సంక్షేమ పథకాలను‌ శ్రీ జగన్ మాత్రమే సమర్థవంతంగా అమలు చేయగలరని అన్నారు. ఇందుకోసం శ్రీ జగన్‌ను ముఖ్యమంత్రి‌ని చేయాల్సిన అవసరముందని అన్నారు.
Back to Top