వైయస్ఆర్ కాంగ్రెస్‌లో చేరిన రాంభూపాల్

కంపాడు:

కాంగ్రెస్ నాయకుడు రాంభూపాల్ రెడ్డి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆదివారంనాడు 32వ రోజు మరో ప్రజాప్రస్థానం పాదయాత్రకు ఉపక్రమించిన పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. కంపాడు నుంచి ఉదయం 10.30గంటల ప్రాంతంలో యాత్ర ప్రారంభమైంది. ఆదివారం నాటి యాత్రలో పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడూ, సీనియర్ నేత డాక్టర్ ఎంవీ మైసూరా రెడ్డి, బొబ్బిలి ఎమ్మెల్యే సుజయరంగారావు పాల్గొన్నారు.

Back to Top