'వైయస్‌ఆర్ ఆశయ సాధనకు కృషి చేయాలి'

కాకినాడ : బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతే ధ్యేయంగా తన జీవిత పర్యంతమూ కృషి చేసిన మహోన్నత నాయకుడు డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి ఆశయ‌ సాధనకు ప్రతి కార్యకర్త కృషి చేయాలి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తూర్పుగోదావరి జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి పిలుపునిచ్చారు. తూరంగిలో కోకనాడ అన్నదాన సమాజం మాజీ ఛైర్మన్ బొబ్బిలి గోవిందు ఆధ్వర్యంలో మంగళవారంనాడు వందలాది మంది కార్యకర్తలు వై‌యస్‌సిపిలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిట్టబ్బాయి ముఖ్య అతిథిగా ప్రసంగించారు. నిరు పేదలందరి గుండెల్లోనూ మహానేత వైయస్‌ఆర్ దేవునిగా నిలిచిపోయారన్నారు. మహానేత అడుగుజాడల్లోనే నడుస్తున్న ఆయన తనయుడు, వైయస్‌ఆర్‌సిపి అధినేత ‌శ్రీ జగన్‌కు ప్రజల నుంచి విశేషంగా ఆదరణ వస్తోందన్నారు. శ్రీ జగన్‌కు వస్తున్న జనాదరణను చూడలేని కాంగ్రెస్, ‌టిడిపి నాయకులు కుట్రలు పన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారని చిట్టబ్బాయి ఆరోపించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ, శ్రీ జగన్మోహన్‌రెడ్డి మాటకు కట్టుబడిన వ్యక్తి అన్నారు. శ్రీ జగన్ అనుకున్నది సాధించి తీరుతారన్నారు. వై‌యస్‌ఆర్‌ పార్టీ అభ్యర్థి ఎవరైనా ఓటు వేసి అఖండ విజయం చేకూర్చాలన్నారు.

రాష్ట్రంలోని పేదలకు న్యాయం జరగాలంటే శ్రీ జగన్ నాయకత్వంలోని వై‌యస్‌ఆర్‌సిపి అధికారంలోకి రావాలని పార్టీ కేంద్రపాలక మండలి సభ్యుడు పిల్లి సుభాష్‌ చంద్రబోస్ ఆకాంక్షించారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డి త్వరలోనే బయటకు వస్తారని, వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఆయన అన్నారు.‌ హృదయం ఉన్న మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి అని జెడ్పీ‌ మాజీ చైర్మన్ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు.‌ పేదల జీవితాలకు భద్రత ఇవ్వగల ఏకైక నాయకుడు శ్రీ జగన్ మాత్రమేనని ‌ఆయన పేర్కొన్నారు. కేంద్ర పాలక మండల సభ్యుడు జ్యోతుల నెహ్రూ, రాజమండ్రి వైయస్‌ఆర్‌సిపి నాయకుడు ఆదిరెడ్డి అప్పారావు, పార్టీ నాయకులు చలమలశెట్టి సునీల్, జిల్లా ప్రచార‌ విభాగం కన్వీన‌ర్ రావూరి వెంకటేశ్వరరావు, జిల్లా వాణిజ్య విభాగం కన్వీనర్ కర్రి‌ పాపారాయుడు, జిల్లా చేనేత విభాగం కన్వీనర్ పంపన రామకృష్ణ, జిల్లా ‌బిసి విభాగం కన్వీనర్ గుత్తుల రమణ పార్టీలో చేరిన కార్యకర్తలకు పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు.
Back to Top