వైయస్ఆర్ ఆర్టీసీ మజ్దూర్ కార్యక్రమానికి విజయమ్మ

హైదరాబాద్, 25 మే 2013:

వైయస్ఆర్ కాంగ్రెస్ ఆర్టీసీ మజ్దూర్ సంఘం ఆవిర్భావ దినోత్సవాన్ని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించనున్నారు. ఈ నెల 26న ఈ కార్యక్రమం ఏర్పాటవుతుందని యూనియన్ అధ్యక్షుడు ఎ. రాజారెడ్డి వెల్లడించారు. వైయస్ఆర్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. యూనియన్ నాయకులు, ఆర్టీసీ కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని కోరారు.

Back to Top