వైఎస్సే అతి పెద్ద కమ్యూనిస్టు: పువ్వాడ

గొల్లెనపాడు: సమ సమాజ స్థాపన కోసం కృషి చేసి, పేదల సంక్షేమం కోసం నిరంతరం తప్పించిన వైఎయస్ఆరే అతి పెద్ద కమ్యూనిస్టని వైయస్‌ఆర్ సీపీ జిల్లా కన్వీనర్ పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. ఆయన ఆదివారం గొ ల్లెనపాడు గ్రామంలో దివంగత మహా నేత డాక్టర్ వైయస్.రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఏ ర్పాటైన సభలో ఆయన మాట్లాడుతూ.. పేదవాడి గుండెకు చిల్లు పడితే పెద్ద వైద్యం చేయించి, పిల్లల చదువు కోసం ఫీజు రీయింబర్సుమెంట్ ప్రవేశపెట్టి, నిలు వ నీడ లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు కట్టించి, రైతులకు ఉచిత విద్యుత్తు ఇచ్చి.. పేదల పక్షపాతిగా నిలిచారని చెప్పారు. వైయస్.జగన్మోహన్‌రెడ్డి త్వరలోనే బయటకు వస్తారని, ఓదార్పు యాత్రను తిరిగి చేపడతారని చెప్పారు. పార్టీ సీఈసీ సభ్యుడు బాణోత్ మదన్‌లాల్ మాట్లాడు తూ.. మహానేతకోసం మృతిచెందిన కు టుంబాలను ఓదార్చేందుకు వెళ్లి, కోటిమంది హృదయాలను తాకిన నాయకుడు వైయస్.జగన్ అన్నారు. సభకు ముం దు, భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ, దాని అనుబంధ సంఘాల నాయకులు మందడపు వెంకటేశ్వరరావు, అయిలూరి మహేష్‌రెడ్డి, షేక్ లాల్ మహ్మద్, రాయల పుల్లయ్య, సాదం రవి, తన్నీరు నాగేశ్వరరావు, ఏలూరి శ్రీనివాసరావు, వెంపటి చంద్రశేఖర్, మడిపల్లి నాగేశ్వరరావు, ఉయ్యూరి రామకృష్ణ, శీలం కరుణాకర్ రెడ్డి, పాముల వెంకటేశ్వర్లు, శ్రీనివాసరావు, వెంకటనారాయణ , రవి, రాంబాబు, జాన్‌పాషా, ఎస్‌కె.కౌసర్, వెంకట్‌గౌడ్, ఎం.శ్రీనివాసరావు, శివకుమార్, డాక్టర్ కోటయ్య పాల్గొన్నారు.

ఎస్సైపై చర్య కోరుతూ... వైయస్‌ఆర్‌సీపీ రాస్తారోకో
కూసుమంచి: వినాయక నిమజ్జనం సందర్భంగా భోజనం చేయాలని కోరిన వైయస్‌ఆర్ సీపీ మండల కన్వీనర్ బండ్ల సోమిరెడ్డిపై చేయి చేసుకున్న ఎస్‌ఐ రాజేంద్రప్రసాద్‌పై చర్య తీసుకోవాలని ఆదివారం ఆ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. రాష్ట్రీయ రహదారిపై సుమారు గంట పాటు వారు రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీలకతీతంగా నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అకారణంగా చేయి చేసుకున్న ఎస్‌ఐపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న సీఐ వెంకటరావు ఫోన్‌లో గ్రామానికి చెందిన ఎడవెల్లి రాంరెడ్డితో మాట్లాడి స్టేషన్‌కు రమ్మన్నారు. ఈ కార్యక్రమంలో సామిరెడ్డి నరేందర్‌రెడ్డి, బండ్ల వెంకటరెడ్డి, కోంట్యానాయక్, బండ్ల మంగిరెడ్డి, విజయపాల్‌రెడ్డి, బత్తుల వీరన్న,ఎడవెల్లి పుల్లారెడ్డి పాల్గొన్నారు.

పోలీస్‌ స్టేషన్ ఎదుట ధర్నా...
తనపై చేయి చేసుకోవడాన్ని నిరసిస్తూ మండల కన్వీనర్ సోమిరెడ్డి పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. ఎస్‌ఐ చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ స్టేషన్ ఎదుట బైఠాయించారు. ఈ క్రమంలో సీఐ వెంకటరావు న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో సోమిరెడ్డి ధర్నా విరమించారు. ఈ సందర్భంగా మండల కన్వీనర్ సోమిరెడ్డి మాట్లాడుతూ.. భోజనం చేయమన్నందుకే తనను ఎస్‌ఐ అకారణంగా కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ యువజన విభాగం మూడు జిల్లాల ప్రాంతీయ కోఆర్డినేటర్ సాధు రమేష్ రెడ్డి, జిల్లా నాయకులు జర్పుల బాలాజీ నాయక్, పిట్టా సత్యనారాయణ రెడ్డి, జిల్లేపల్లి సైదులు మాట్లాడుతూ.. ఎస్‌ఐ చర్యల వలన తమ పార్టీ నాయకునికి మనస్తాపం కలగడంతో పాటు కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నాయని, దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. సోమిరెడ్డిపై ఎస్‌ఐ చేయిచేసుకోవడం దురదృష్టకరమని సీఐ వెంకటరావు అన్నారు. ఈ చర్చల్లో గ్రామపెద్దలు ఎడవెల్లి రాంరెడ్డి, సామిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. జరిగిన సంఘటనపై ఎస్‌ఐ రాజేంద్రప్రసాద్ వివరణ ఇస్తూ సోమిరెడ్డి తన పట్ల అసభ్యంగా ప్రవర్తించినందుకే చేయి చేసుకోవాల్సి వచ్చిందని అన్నారు.

Back to Top