టీడీపీ అనైతిక విధానాలకు నిరసనగా వాకౌట్

నరసరావుపేట రూరల్ః మండల పరిషత్‌ సాధారణ సర్వసభ్య సమావేశం నుంచి వైయస్సార్సీపీ వాకౌట్ చేసింది.  ఎజెండాకు వ్యతిరేకంగా వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సభ్యులు తీర్మానం చేశారు. అధికార పార్టీ మోసాలు, ప్రలోభాలకు నిరసనగా పార్టీ ఎంపీటీసీలు సమావేశం నుంచి వాకౌట్‌ చేశారు. వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీటీసీలను అనేక విధాలుగా టీడీపీ నేతలు ప్రలోభపెడుతున్నారని,  కేసులు పెడతామని బెదరిస్తున్నారని ఎమ్మెల్యే డా.గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. డబ్బులు, పనులు, ఉద్యోగాలు ఆశ చూపుతున్నారని ఫైరయ్యారు. 

టీడీపీ అనైతిక వ్యవహారాలకు నిరసనగానే సమావేశం నుంచి వాకౌట్ చేసినట్టు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. 13వ ఫైనాన్స్‌ నిధులు ఎంపీటీసీలు అందరికి సమానంగా ఇస్తామంటే మా సభ్యులు ఎక్కువ మంది ఉన్నా అంగీకరించామన్నారు. కాని అధికార పార్టీ తామే చేసుకుంటామని మోసానికి పాల్పడిందన్నారు.  తమ సహకారంతో గెలుపొందిన వ్యక్తి పార్టీ మారి ఈ విధంగా చేయడం దారుణమన్నారు. 

Back to Top