వాగును చూసి ఆగిన షర్మిల

ఉరవకొండ

2 నవంబర్ 2012 : అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో పదహారవ రోజు పాదయాత్రలో భాగంగా నడక సాగిస్తున్న షర్మిల శుక్రవారం ఒకచోట నిండుగా ప్రవహిస్తున్న వాగును చూసి ఆగి పోయారు. ఈ నీళ్లు ఎటు వెళుతున్నాయి? ఈ నీటిని వృథా కాకుండా పంటలకు ఎలా వినియోగించుకోగలం? వంటి విషయాలపై ఆమె వైయస్ఆర్ సీపీ నేతలతో చర్చించారు. వై.విశ్వేశ్వర రెడ్డి, జి.గుర్నాథరెడ్డి తదితర వైయస్ఆర్ సీపీ నేతలు ఆమెకు వాగు వివరాలు తెలిపారు. ఇలా తన పాదయాత్రలో ప్రతి విషయాన్నీ షర్మిల అడిగి తెలుసుకుంటున్నారు, వివిధ అంశాలపై అవగాహన పెంచుకుంటున్నారు. దారిలో వృద్ధులతో ఆప్యాయంగా మాట్లాడుతూ వారి సమస్యలు వింటున్నారు. భరోసా ఇస్తున్నారు.

Back to Top