అమెరికాలో వైఎస్సార్ వ‌ర్థంతి కార్య‌క్ర‌మాలు

హైద‌రాబాద్: వైఎస్సార్‌సీపీ అమెరికా ఎన్ ఆర్ ఐ క‌మిటీ ఆధ్వ‌ర్యంలో దివంగ‌త మ‌హానేత వైఎస్సార్ వ‌ర్ధంతి కార్య‌క్ర‌మాలు జ‌రిగాయి. ఈ సంద‌ర్భంగా వైఎస్సార్ అభిమానులు ప‌లు సేవ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. ఈ కార్యక్ర‌మాల్ని వైఎస్సార్‌సీపీ అమెరికా ఎన్ ఆర్ ఐ క‌మిటీ స‌మ‌న్వ‌య ప‌రిచింది. ఈ సంద‌ర్బంగా రాజ‌న్న చేసిన సేవ‌ల్ని ప‌లువురు గుర్తు చేసుకొన్నారు. 

సాత్విక్ రెడ్డి గోగుల మూడి, సందీప్ భీమిరెడ్డి, స్వ‌రూప్ శిలాస్‌, సందీప్ రెడ్డి వౌకంట్, ర‌వి తేజ రెడ్డి ఆధ్వ‌ర్యంలో న్యూ జెర్సీ లో ఆహార పంపిణీ, ర‌క్త దానం కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. సెంట్ న్యూ బ్రూన్స్ విక్ లో ఆహార పంపిణీ చేప‌ట్టారు. ఆదిత్య రెడ్డి, రోహిత్ గంగిరెడ్డి, దిలీప్ దొండ‌పాటి, పృథ్వి ప్ర‌వీణ్‌, ప్రేమ్ కుమార్‌, శివ‌కుమార్‌, య‌శ్వంత్, క‌రుణ్‌, జ‌గ‌దీష్ ఆధ్వ‌ర్యంలో నోబుల్ మ‌నార్ ఓల్డ్ ఏజ్ హోమ్ లో సేవ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. క్రాఫ్ట్ మెటీరియ‌ల్ పంచి పెట్టారు. ఫోనిక్స్ అరిజోనా టీమ్ గౌత‌మ్ త‌దిత‌రుల ఆధ్వ‌ర్యంలో ఆహార పంపిణీ చేప‌ట్టారు. ఈ కార్య‌క్ర‌మాల్ని వైఎస్సార్‌సీపీ అమెరికా ఎన్ ఆర్ ఐ క‌న్వీన‌ర్లు ర‌త్నాక‌ర్, మ‌ధులిక‌, గుర‌వారెడ్డి, రాజ‌శేఖ‌ర్ త‌దిత‌రులు స‌మ‌న్వ‌య ప‌రిచారు. 
Back to Top