ఉపాధి హామీ కూలీల కంట తడి

అనంతపురం:

మరో ప్రజాప్రస్థానం పదకొండోరోజు పాదయాత్ర ఆదివారం రాప్తాడు నియోజకవర్గంలోకి ప్రవేశించింది.  వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి సోదరి షర్మిల వెంట పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. గ్రామాలనుంచి ప్రజలు పరుగులు తీస్తూ రావడం కనిపించింది. రాప్తాడు నియోజవర్గంలో ప్రజలు ఆమెకు ఘనస్వాగతం పలికారు. పెన్న అహోబిళం కాలువను షర్మిల పరిశీలించారు. ఉపాధి హామీ కూలీలు తమ కష్టాలను ఆమెకు చెప్పుకుని కంటతడిపెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో తమకు 30 రూపాయల కూలీ కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జగనన్న సీఎం అయిన తర్వాత అందరి కష్టాలూ తీరతాయని షర్మిల వారికి భరోసా ఇచ్చారు.

తాజా వీడియోలు

Back to Top