ప్రభుత్వానికి ఇదో గుణపాఠం...!

హైదరాబాద్ః ప్రత్యేకహోదా అంశం ఉద్యమంగా రూపుదిద్దుకుంటుందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. ప్రత్యేకహోదా సాధన కోసం తిరుపతిలో విద్యార్థులతో నిర్వహించిన యువభేరి సదస్సు విజయవంతమైందని ఉమ్మారెడ్డి తెలిపారు. ఇకనైనా ప్రభుత్వానికి కనువిప్పు కావాలని అన్నారు. స్పెషల్ స్టేటస్ విషయంలో అవివేకంగా ప్రవర్తించడం మానుకొని..సదస్సునుంచైనా గుణపాఠం నేర్చుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. 

ఎస్వీ యూనివర్సిటీలో అనుమతి నిరాకరించినా విద్యార్థులు వేలాదిగా తరలివచ్చారని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. తిరుపతి పీఎల్ఆర్ కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహించిన యువభేరి సదస్సుకు యువనాయకులు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యావేత్తలతో పాటు విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈకార్యక్రమంలో పాల్గొన్నారు. 
Back to Top