యూ–టర్న్‌ అంకుల్‌.. మరో యూ–టర్న్‌కు రెడీ...

 చంద్రబాబు కాంగ్రెస్‌కు సరెండర్‌ అయిపోయి రాహుల్‌ పాదాల దగ్గర వాలిన తీరు చూస్తుంటే ఈ ‘యూ–టర్న్‌ అంకుల్‌ మరో చారిత్రక ‘యూ–టర్న్‌కు సిద్ధపడిపోతున్నారంటూ ట్విట్టర్‌లో వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.  రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన కాంగ్రెస్‌ పార్టీలోనే తాను దొంగిలించిన టీడీపీ పార్టీని విలీనం చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ట్విట్‌ చేశారు. చంద్రబాబు పక్కా కాపీ క్యాట్‌ అంటూ పేర్కొన్నారు. ఐడియా, స్కీమ్‌ చంద్రబాబు సొంతం కాదు..చదువులో మొదలుకొని రాజకీయాల వరకు కాపీ కొట్టడంలో బాబు నేర్పరితనానికి డాక్టరేట్‌ ఇవ్వడానికి ఏ వర్శిటీ అయినా రావాల్సిందే అంటూ ట్వీట్‌ చేశారు. ఐటీ పరిభాషలో చంబ్రాబు కాపీ–పేస్ట్‌ మ్యాన్‌గా పేర్కొన్నారు.

Back to Top