వ్యూహ రచనల్లో టీ వైఎస్సార్సీపీ

హైదరాబాద్: వరంగల్ లోక్ సభ స్థానానికి జరిగే ఉప ఎన్నికలకు సంబంధించి టీ వైస్సార్సీపీ వ్యూహ రచనలకు శ్రీకారం చుట్టింది. హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో టీ వైస్సార్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి అధ్యక్షతన సీనియర్ నాయకులు మంగళవారం మధ్యాహ్నం సమావేశం అవుతున్నారు. ఉప ఎన్నికలకు సంబంధించి లోతుగా చర్చించనున్నారు. ఆ తర్వాత తీసుకొనే నిర్ణయాల్ని పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ కు వివరించి తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని పార్టీ ప్రధానకార్యదర్శి శివకుమార్ వెల్లడించారు.
Back to Top