హైదరాబాద్) భారత రాజ్యాంగ నిర్మాత డా. బీ ఆర్ అంబేద్కర్ విగ్రహానికి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ నివాళులు అర్పించారు. కాల్ మనీ సెక్సు రాకెట్ కుంభకోణం మీద చర్చను అడ్డుకొనేందుకు అంబేద్కర్ పేరును అదే పనిగా వాడుకొంటున్నారు. దీనికి నిరసనగా వైఎస్ జగన్ రాష్ట్ర వ్యాప్తంగా నివాళులు అర్పించేందుకు పిలుపు ఇచ్చారు. ఇందులో భాగంగా హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీ ఆర్ అంబేద్కర్ పేరును కాల్ మనీ సెక్సు రాకెట్ కోసం చంద్రబాబు వాడుకోవటం అన్నది గర్హనీయం అని అభిప్రాయ పడ్డారు.ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే..అంబేద్కర్ వద్దకు వచ్చి, ఆయన విగ్రహానికి పాలాభిషేకం చేసి, చంద్రబాబు హయాంలో అంబేద్కర్‌ను సైతం రాజకీయ అవసరాల కోసం ఉపయోగించుకునే తీరును వ్యతిరేకించాం.ఆయనకు నివాళులు అర్పించాం.ఎంత హేయమైన పరిస్థితిలో రాజకీయ వ్యవస్థ ఉందంటే, మొత్తం రాష్ట్రం తలదించుకునేలా విజయవాడలో సెక్స్ రాకెట్ నడుస్తోంది.విజయవాడలో అధిక వడ్డీకి ఆడవాళ్లకు డబ్బులిచ్చి, ఆ వడ్డీలు కట్టలేని ఆడవాళ్లు, పేదవాళ్ల మాన ప్రాణాలతో ఆడుకునే అధ్వాన పరిస్థితి విజయవాడలో జరుగుతోంది.ఆడాళ్లను అశ్లీలంగా వీడియో టేపులు తీసి, వాళ్లను శాశ్వతంగా వ్యభిచారంలో ముంచేసేలా చేస్తున్నారు.ఈ నేరంలో సాక్షాత్తు చంద్రబాబు దగ్గర్నుంచి ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు అందరికీ భాగస్వామ్యం ఉంది.వాళ్లంతా దోషులుగా నిలబడాలి.కానీ చంద్రబాబు నిన్న అసెంబ్లీలో హేయంగా ప్రవర్తించారు.ఈ టాపిక్ బయటకు రాకూడదన్న ఉద్దేశంతో, ఎజెండాలో లేకపోయినా రెండోసారి సభ వాయిదా పడినప్పుడు సెక్స్ రాకెట్ అంశాన్ని డైవర్ట్ చేయడానికి అంబేద్కర్ అంశాన్ని తెరమీదకు తెచ్చారు.అసెంబ్లీ జరిగేది ఐదు రోజులు, అదికూడా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే. ఈ ఐదు రోజుల్లో సెక్స్ రాకెట్ మీద చర్చించాలన్న ఆలోచన లేదు.చివరకు అంబేద్కర్‌ను కూడా వదల్లేదునిజానికి అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14న, వర్ధంతి డిసెంబర్ 6న.ఆయన అధ్యక్షత వహించిన రాజ్యాంగ సంఘం తొలి సమావేశం డిసెంబర్ 9, 1946రాజ్యాంగ రచన పూర్తి చేసింది నవంబర్ 26నచంద్రబాబుకు ఈ తేదీలలో ఎప్పుడూ అంబేద్కర్ గుర్తురాలేదు. అప్పుడు నివాళులు అర్పించాలని అనుకోలేదుడిసెంబర్ 17న ఏమీ లేనప్పుడు మాత్రం అసెంబ్లీలో అంబేద్కర్ గురించి చర్చిస్తామంటారుఇప్పుడు కూడా ఆయన ఏంచేయబోతున్నాడు, అసెంబ్లీలో ప్రకటన ఇస్తాడట. అది ఇంకా దారుణం.స్టేట్‌మెంట్‌కు, చర్చకు చిన్న తేడా ఉంది. సీఎం స్టేట్‌మెంట్ ఇస్తే, ఇక చర్చ జరగదు. ప్రకటన మీద రెండు మూడు నిమిషాలు స్పష్టత ఇస్తారుఆయన ఇచ్చే ప్రకటన కూడా విజయవాడ అంశాన్ని దారి మళ్లించేందుకే. అందుకోసమే రాష్ట్రవ్యాప్తంగా వడ్డీ వ్యాపారుల మీద దాడులు చేయిస్తున్నాడుఇదేదో సాదాసీదా వడ్డీ వ్యాపారంగా చిత్రీకరించి, సెక్స్ రాకెట్‌లో తాను, తనవాళ్లను తప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాడు.సెక్స్ రాకెట్ చర్చను దారి మళ్లించేందుకు అంబేద్కర్ గారిని వాడుకుంటున్నారురాష్ట్రంలో చదువుకున్న ప్రతి ఒక్కరికీ విన్నపం చేస్తున్నాచంద్రబాబు వల్ల ఎక్కడా రూపాయి అప్పు పుట్టడంలేదుసున్నా వడ్డీకి అప్పులు దొరకట్లేదుఅధికవడ్డీకి అప్పులు తెచ్చుకోవాల్సి వస్తోంది.అలా అప్పు తీసుకున్న ఆడాళ్లను వేశ్యవృత్తిలోకి దించుతున్న ఈ రాకెట్‌ను మనంతా కలిసి అడ్డుకోవాలి.లేకపోతే ఈ వ్యవస్థ ఇక బాగుపడదు. అంతా కలిసి ఒక్కటవుదాం.చంద్రబాబు, ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరినీ చట్టం ముందుకు తీసుకొద్దాంప్రతిపక్ష సభ్యులను సస్పెండ్ చేసి అయినా సరే అంబేద్కర్ మీద చర్చ జరపాలని కోరినందుకు ఆయనకే విన్నవించుకుంటున్నాంమీరు పోయిన తర్వాత ఎంత దుర్మార్గమైన పరిస్థితి ఉందో చూడాలని కోరాంపేద మహిళల కోసం మేం పోరాటం చేస్తుంటే, దానిపై చర్చ జరగనివ్వకుండా, అంబేద్కర్‌ను తెరమీదకు తెచ్చారు.ఆయన వైఖరికి దేవుడు, ప్రజలు బుద్ధి చెబుతారు.