మైదాన ప్రాంతంలో మినీ ఐటీడీఏ ఏర్పాటు చేయాలి


విశాఖ: మైదాన ప్రాంతంలో మినీ ఐటీడీఏ ఏర్పాటు చేయాలని గిరిజనులు వైయస్‌ జగన్‌ను కోరారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు పాదయాత్రగా బయలుదేరిన వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని అన్ని వర్గాల ప్రజలు కలిసి తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. 238వ రోజు ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్‌ జగన్‌ను గోలుగొండ, నాతవరం మండలాలకు చెందిన గిరిజనులు ములపూడి వద్ద కలిశారు. మైదాన ప్రాంతానికి చెందిన గిరిజనులను ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. విద్య, ఉద్యోగ అవకాశాలు కల్పించడం లేదని వాపోయారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి మరణం తరువాత తమను పట్టించుకునే నాథుడు కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనులతో సమానమైన హక్కులు మైదాన ప్రాంతంలో కూడా వర్తింపజేయాలన్నారు. పేదలను పట్టించుకోవడం లేదని తెలిపారు. మా గ్రామాల్లో నీటి సమస్య తీవ్రంగా ఉందని వైయస్‌ జగన్‌కు వివరించారు. మైదాన ప్రాంతంలో మినీ ఐటీడీఏ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. వారి సమస్యలు సావధానంగా విన్న వైయస్‌ జగన్‌ ...అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
 

తాజా ఫోటోలు

Back to Top