పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టులో విచారణ

న్యూఢిల్లీ: ఏపీలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వేసిన పిటిషన్‌ ఇవాళ విచారణకు వచ్చింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని వైయస్సార్‌సీపీ తన పిటిషన్‌లో కోరింది.  సుప్రీంకోర్టు విచారణను ప్రస్తుతానికి వారం రోజుల పాటు వాయిదా వేసింది. చంద్రబాబు అనైతికంగా, విచ్చలవిడిగా అవినీతి సొమ్మును వెదజల్లి 20 మంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోళ్లు చేసిన సంగతి తెలిసిందే. 

ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను విస్మరించి, పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ చంద్రబాబు నీచ రాజకీయాలకు తెరలేపారు.  పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాల్సిన శాసన సభాపతి సైతం అధికారపార్టీకి కొమ్ముకాస్తూ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్న మాట బలంగా వినిపిస్తోంది. ఈనేపథ్యంలో ఫిరాయింపుదారులను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ వైయస్సార్సీపీ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. 
Back to Top