నేడు రాజంపేట‌లో మ‌హాధ‌ర్నా

వైయ‌స్ఆర్ జిల్లా: కడపలో ఉక్కు ఫ్యాకర్టీ నిర్మించాల‌ని డిమాండు చేస్తూ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో రాజంపేట ప‌ట్ట‌ణంలో ఇవాళ మ‌హాధ‌ర్నా ఏర్పాటు చేశారు. ఉక్కు ఫ్యాక్ట‌రీ నిర్మిస్తే చదువుకున్నయువతకు ఉద్యోగాలు దొరుకుతాయని, ప్రజలకు ఉపాధి లభిస్తుందని  వైయ‌స్ఆర్‌ సీపీ నేత‌లు పేర్కొంన్నారు. కడపలో మానవ వనరులు  అధికంగా ఉన్నాయని, ఉక్కు ఫ్యాక్టరీకి కావాల్సిన నీరు, విద్యుత్‌, ఖనిజం, భూమి, ఈ ప్రాంతంలో ఉన్నాయని చెబుతున్నారు. ఇన్ని సహజ వనరులు ఉన్నచోట ఫ్యాక్టరీని ఎందుకు  నిర్మించరని  కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.  కడపలో వైఎస్సార్‌ సీపీ నిర్వహించిన మహాధర్నాలో ఆయన ప్రసంగించారు.
Back to Top