హామీలు అమలు చేయకుండా కాలయాపన

విశాఖపట్నంః పార్లమెంట్ లో ప్రత్యేకహోదా కోసం ప్రవేశపెట్టిన ప్రత్యేక బిల్లు చర్చకు రాకుండా టీడీపీ, బీజేపీలు సభను అడ్డుకోవడం దారుణమని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. విశాఖలో పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.  ప్రత్యేకహోదాపై ఆ రెండు పార్టీలకు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. రాష్ట్రానికి హోదా ఇవ్వాలని మొదటి నుంచి పోరాడుతున్న ఏకైక పార్టీ వైయస్సార్సీపీ అని తెలిపారు. 

వెనుకబడిన ఉత్తరాంధ్రకి ప్రత్యేక ప్యాకేజీ , విశాఖకు రైల్వే జోన్ ,  ప్రత్యేక హోదా సహా విభజన చట్టంలోని హామీలను అమలు చేయకుండా  టీడీపీ, బీజేపీలు కాలయాపన చేస్తున్నాయని ప్రసాద్ రెడ్డి ధ్వజమెత్తారు . 2018కల్లా పోలవరం పూర్తి చేస్తామని బాబు గొప్పులు చెబుతున్నారు తప్ప పనులు కార్యరూపం దాల్చిన దాఖలాలు లేవన్నారు.  పక్కి దివాకర్ , ఉషా కిరణ్ , సిర్తల వాసు, తుళ్ళి చంద్ర శేఖర్ యాదవ్  , శ్రీదేవి వర్మ పత్రికా సమావేశం లో పాల్గొన్నారు. 
Back to Top