తాడేపల్లి: రాష్ట్రంలో 10 కొత్త మెడికల్ కాలేజీలను పీపీపీ పేరుతో ప్రైవేటీకరించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రజా ఉద్యమం అప్రతిహతంగా కొనసాగుతోంది. మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా బుధవారం అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన ర్యాలీలు కొనసాగాయి. పార్టీలకు అతీతంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజా సంఘాలు, మేథావులు, నిపుణులు, సామాజిక కార్యకర్తలు.. అలా అన్ని వర్గాల వారు ఆ ర్యాలీల్లో పాల్గొన్నారు. 175 అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన ర్యాలీలు కొనసాగాయి. ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని మంగళవారం నుంచే ప్రయత్నించిన పోలీసులు.. అనేకచోట్ల పార్టీ నాయకులకు నోటీసులు ఇచ్చారు. చాలా మందిని గృహ నిర్భంధం చేశారు. ర్యాలీలో పాల్గొంటే కేసులు పెడతామని కూడా బెదిరించారు. అయినా ఎక్కడా పార్టీ శ్రేణులు కానీ, నాయకులు కానీ వెనక్కు తగ్గలేదు. అంతా ఒక్కటై కదలి వచ్చారు. ప్రజలూ పెద్ద సంఖ్యలో తరలి రావడంతో, అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన ర్యాలీల పర్వం ఒక ప్రభంజనంలా కొనసాగింది. అందరూ ముక్త కంఠంతో ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టారు. 10 కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని విరమించాలని డిమాండ్ చేశారు. మిగిలిన కాలేజీల పనులు కూడా పూర్తి చేసి, అన్నింటినీ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడపాలని కోరారు. పీపీపీ పేరుతో మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తూ దాదాపు లక్ష కోట్ల సంపదను సీఎం చంద్రబాబు తన బినామీలకు కట్టబెడుతున్నారని దుయ్యబట్టారు. మరోవైపు ఉద్యమంలో భాగంగా చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ప్రతి నియోజకవర్గం నుంచి 50 వేల సంతకాలు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నా, అంతకు మించి సంతకాలు చేస్తున్నారు. బుధవారం నిరసన ర్యాలీల అనంతరం రెవెన్యూ అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. 2/54 3/54 Advertisement 4/54 6/54 7/54 8/54 9/54 10/54 11/54 12/54 13/54 14/54 15/54 16/54 17/54 18/54 19/54 20/54 21/54 22/54 23/54 24/54 25/54 26/54 27/54 28/54 29/54