హిందూపురంలో రెచ్చిపోయిన ప‌చ్చ‌మూక‌లు

వైయ‌స్ఆర్‌సీపీ కార్యాల‌యంపై దాడి

శ్రీ సత్యసాయి జిల్లా: ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గం లో టీడీపీ నేతలు బరితెగించారు. శ‌నివారం వైయ‌స్ఆర్‌సీపీ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్ టీఎన్ దీపిక కార్యాల‌యంపై దాడి చేసి బీభ‌త్సం సృష్టించారు. ఇవాళ‌ ఎమ్మెల్యే బాలకృష్ణ  పర్యటన లో భాగంగా టిడిపికి చెందిన‌ కొంతమంది గూండాలు వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై దాడి చేసి ఫర్నిచర్, ఆఫీసు సిబ్బందిపై విచక్షణ రకతంగా దాడి చేసి ధ్వంసం చేశారు. ఎమ్మెల్యే బాలకృష్ణ  ఈరోజు హిందూపురానికి వస్తున్నారని ఆయనతో మెప్పు పొందడానికి చింటూ కొంతమంది టిడిపి కన్వీనర్ వెంకటేష్ తదితర టిడిపి గుండాలు వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ పై ఎదుర్కోలేక ఇంత విచక్షణారత రహితంగా దాడి చేశారు. టీడీపీ నేత‌ల దాడిని వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్య‌క్షురాలు ఉషాశ్రీ‌చ‌ర‌ణ్, నియోజ‌వ‌క‌ర్గ ఇన్‌చార్జ్ దీపిక‌, వేణురెడ్డిలు తీవ్రంగా ఖండించారు. పార్టీ కార్యాల‌యాన్ని వారు ప‌రిశీలించి, దాడికి గురైన కార్య‌క‌ర్త‌ల‌ను ప‌రామ‌ర్శించారు. పార్టీ శ్రేణులు సంయ‌మ‌నం పాటించాల‌ని వారు కోరారు. 

Back to Top