తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైయస్ఆర్ టీఎఫ్ జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ను నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల అయ్యింది. పుంగనూరుకు చెందిన డాక్టర్ చింతల ద్వారకనాథ్‌రెడ్డిని ప్రకాశం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల జోనల్ వైయస్ఆర్ టీఎఫ్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించారు.